schedule Wednesday, June 17, 2026

కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో హైడ్రామా.

calendar_today September 30, 2024
person meenewstelugu

కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో హైడ్రామా.

పేద ప్రజల ఉసురు ఊరికేనే పోదు 

తాండూర్ మండల బీ.ఆర్.ఎస్ పార్టీ బీ.సీ.సెల్ అధ్యక్షుడు ఆర్.సీ గౌడ్.

మీ:: న్యూస్ ప్రతినిధి::తాండూరు .కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో హైదరాబాద్ కొనసాగిస్తుందని తాండూర్ మండల బీ.ఆర్.ఎస్ పార్టీ బీ.సీ.సెల్ అధ్యక్షుడు ఆర్.సీ గౌడ్ విమర్శించారు. సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని మండిపడ్డారు. ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. హైడ్రా పేరుతో హైడ్రామా సృష్టిస్తున్నారని ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి చేయాలంటే ఎన్నో పనులు ఉన్నాయని కావాలని కక్ష సాధింపుగా పేద ప్రజలపై హైడ్రా పేరుతో హైడ్రామా సృష్టిస్తున్నారని తెలిపారు. పేద ప్రజల ఉసురు ఊరికేనే పోదని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఎలాంటి దారుణాలకు పాల్పడలేదని పేద ప్రజల

వెన్నంటూ ఉండి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లారని గుర్తు చేశారు .ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హైడ్రామా పనులు మానుకోవాలని కోరారు. ప్రజలకు కాంగ్రెస్ పాలన 9 నెలలకే విసుగు చెంది తిరిగి కెసిఆర్ పాలన కోరుకుంటున్నారని తెలిపారు.  పేద ప్రజలు బూతు మాటలతో విమర్శిస్తున్నారని వెల్లడించారు. ధనికులను వదిలేసి పేద ప్రజలపై ఐ డ్రామా సృష్టించడం సమంజసం కాదని విజ్ఞప్తి చేశారు.బిఆర్ఎస్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు అండగా ఉంటామని సైలెంట్ గా ఉన్నామంటే చేతకాక కాదు సమయం వచ్చినప్పుడు మా తడాఖా ఏమిటో చూపిస్తామన్నారు.