schedule Wednesday, June 17, 2026

బి ఆర్ ఎస్ పార్టీ నుండి సిపిఐ(ఎం )లో చేరిక...

calendar_today September 26, 2024
person meenewstelugu

బి ఆర్ ఎస్ పార్టీ నుండి సిపిఐ(ఎం )లో చేరిక...

మీ:: న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్::మోతే : సిపిఐ(ఎం ) పార్టీ చేస్తున్న ప్రజా పోరాటాలకు ఆకర్షితులై ప్రజలు అనేకమంది సిపిఐ (ఎం )పార్టీలో చేరుతున్నారని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు గురువారం మండల పరిధిలోని రావి పహాడ్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ వార్డు సభ్యులు కుశన పెళ్లి గురువయ్య ఆ పార్టీకి రాజీనామా చేసి మాతృ సంస్థ అయిన సిపిఐ(ఎం) పార్టీలో చేరారు. ఆయనకు సిపిఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సి పి ఐ (ఎం) పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. ప్రజల కోసం నిరంతరం పోరాడేది సిపిఐ(ఎం) పార్టీ మాత్రమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం) మండల కార్యదర్శి ములుకూరి గోపాల్ రెడ్డి, సిపిఐ(ఎం) మండల కమిటీ సభ్యులు సోమ గాని మల్లయ్య, జంపాల స్వరాజ్యం, పోతయ్య, లింగయ్య, లచ్చిరాం,సిపిఐ( ఎం) గ్రామ శాఖ కార్యదర్శి ఎర్రబోయిన మాల్సుర్, నాయకులు వెలుగు మధు, పొడపంగి ఈదయ్య, ములకలపల్లి మాల్సుర్, కోడి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.