schedule Wednesday, June 17, 2026

జెమిలి ఎన్నికల విధానం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం....

calendar_today September 24, 2024
person meenewstelugu

జెమిలి ఎన్నికల విధానం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం....

 

 సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు

మీ:: న్యూస్ ప్రతినిధి కోల అక్షయ్:: మోతే : మాజీ రాష్ట్రపతి రామ్ నాథ కోవింద్ ఉన్నత స్థాయి కమిటీ దేశంలో ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని తీసుకురావడం వల్ల దేశ ఫెడరల్ విధానానికి విఘాతం కలుగుతుందని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైందని, దీనిని అందరూ వ్యతిరేకించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు కోరారు. మంగళవారం మోతే మండల పరిధిలోని మామిళ్లగూడెం, విబలాపురం గ్రామాలలో నిర్వహించిన సిపిఎం గ్రామ శాఖ మహాసభల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం తీసుకురావడం వల్ల దేశంలోని ఐక్యతకు ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగి అవకాశాలు ఉన్నాయన్నారు. దీనివల్ల ఐదు సంవత్సరాలు పరిపాలించన ప్రభుత్వాలు రెండూ లేదా మూడేళ్లు మాత్రమే అవసరమైతే ఒక సంవత్సరం మాత్రమే పదవి కాలంలో ఉంటాయన్నారు. తద్వారా రాష్ట్రాల అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. జమిలి ఎన్నికల విధానం ద్వారా ఆర్టికల్ 83, ఆర్టికల్ 172 ను సవరించాల్సిన పరిస్థితి వస్తుందని రాజ్యాంగం లోని మార్పులకు బిజెపి ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగమే ఈ జమిలి ఎన్నికల విధానం అన్నారు. గత ఏడాది 10 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగినా మళ్లీ 2028 సంవత్సరంలో ఎన్నికలు జరపవలసిన అవసరం వస్తుందని అప్పుడు ఏర్పడిన ప్రభుత్వాలు ఒక సంవత్సరం అంతకన్నా తక్కువ సమయం కాలమే అధికారంలో ఉంటాయన్నారు. ఈ విధానం మూలంగా మన రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలుగుతుందని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంఎన్నికల ముందు ఇచ్చిన అన్ని వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.పేదల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అసైన్మెంట్ కమిటీలను పునరుద్ధరించి ప్రభుత్వ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్న దళిత బడుగు బలహీన వర్గాల రైతులకు పట్టాలు ఇవ్వాలని కోరారు.

 సిపిఎం గ్రామ కార్యదర్శిల ఎన్నిక

 సిపిఎం పార్టీ మామిల్లగూడెం గ్రామ కార్యదర్శిగా షేక్ జహీనాభి, విబలాపురం గ్రామ కార్యదర్శిగా నాగం మల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మహాసభలకు

 సిపిఎంనాయకులు వెంకట్ రెడ్డి, ములుకూరి మణెమ్మ అధ్యక్ష వర్గంగా వ్యవహరించరు.ఈ మహాసభలో సిపిఎం మండల కార్యదర్శి ములుకూరి గోపాల్ రెడ్డి, మండల కమిటీ సభ్యులు గుంట గాని ఏసు, చర్లపల్లి మల్లయ్య,నాగం మల్లయ్య, బానోతు లచ్చిరాం, బూడిద లింగయ్య, గుగులోతు కృష్ణ, షేక్ జహీనాభి, సిపిఎం నాయకులు షేక్ జానీ మియా,గౌస్, సయ్యద్ మియా, బోర్రాజు వెంకన్న, చారి, బానోత్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.