schedule Wednesday, June 17, 2026

రైతులందరికీ నష్టపరిహారం అందించాలి 

calendar_today September 13, 2024
person meenewstelugu

రైతులందరికీ నష్టపరిహారం అందించాలి 

---భారీ వర్షాలు, వరదల వలన పంట నష్టపోయిన రైతులందరికీ తక్షణమే పూర్తి నష్టపరిహారం అందించాలి.

 =గ్రామీణ పేదల సంఘం

 --జిల్లా కార్యదర్శి కొనకంచి వీరభద్రయ్య డిమాండ్ చేశారు

మీ:: న్యూస్ ప్రతినిధి::సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం బండమీది చందుపట్ల గ్రామంలో

రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు వరదలు రావడం, కాలువలు, రహదారులు, బ్రిడ్జిలు కొట్టుకుపోవడం, లక్షల ఎకరాల పంట నీటమునడంతో రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.

సూర్యాపేట జిల్లాలో వచ్చిన వరదల వలన వేలాది ఎకరాల వరి పొలాలు నేటికి నీట మునిగి ఇసుక మేటలు పెట్టి ఉండడం, పత్తి పంట జాలుపట్టి పంట చేతికి వచ్చే పరిస్థితి లేకపోవడం, ఇతర పంటలు దెబ్బతినడం రైతులకు తీవ్ర నష్టాన్ని, విషాదాన్ని మిగిల్చింది. రైతులు ఈ పంటలు వేయడానికి సుమారు 25 వేల రూపాయల ఒక ఎకరానికి ఖర్చు చేయవలసి వస్తుంది. ఈ వరదల వలన పంట నష్టపోవడమే కాకుండా తిరిగి సేద్యం చేసుకోవడానికి వీలు లేకుండా ఇసుక మేటలతో , దిబ్బలతో దర్శనమిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం కంటితుడుపు చర్యలుగా వరద ప్రాంతాలలో సందర్శిస్తున్నా రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలను వాగ్దానం చేసి అరకోర అమలు చేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాలను పక్కన బెట్టి గతంలో ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాల మేరకు భారీ వర్షాలు వరదల వలన పంట నష్టపోయిన రైతులందరికీ 25 వేల రూపాయల నష్టపరిహారం అందించాలి. ఎలాంటి నిబంధనలు లేకుండా రైతులందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీని అమలు చేయాలి. తక్షణమే రైతు భరోసా సహాయాన్ని అందించాలి. వరద ఉధృతికి తీవ్రంగా నష్టపోయిన ఇళ్లకు వెంటనే మరమ్మతులు చెయ్యాలి. పూర్తి ఇల్లు కోల్పోయిన వారికి మరో నివాసాయోగ్యానికి ఏర్పాటుచేసి ఇండ్లు కట్టించాలి. గ్రామీణ పేదల సంఘం సూర్యాపేట జిల్లా శాఖ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.