schedule Wednesday, June 17, 2026

సిపిఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిమరణం సీపీఎంకు తీరని లోటు

calendar_today September 12, 2024
person meenewstelugu

సిపిఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిమరణం సీపీఎంకు తీరని లోటు

 ---దేశానికి ఏచూరి చేసిన సేవలు మరువలేనివి

 

 ---ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్భావంతి వ్యక్తం చేస్తున్నాం

 ---సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు

మోతె సెప్టెంబర్ 12 (మీ::న్యూస్ ప్రతినిధి)

 మోతే: సిపిఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు గురువారం ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.1974 లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో చేరిన సీతారాం ఏచూరి 1977-78లో మూడుసార్లు జెఎన్ యు అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారని అన్నారు. 1978లో ఎస్ఎఫ్ఐ అఖిలభారత జాయింట్ సెక్రటరీగా ఎన్నిక అయ్యారని గుర్తు చేశారు.1984 లో సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారని, ఆ తర్వాత పార్టీ పోలిట్ బ్యూరో సభ్యునిగా,2005 నుండి పశ్చిమ బెంగాల్ నుండి మూడుసార్లు రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారని అన్నారు.2015,2018,2022లో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై కొనసాగుతున్నారని అన్నారు. దేశం గొప్ప మేధావిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.దేశంలో అనేక సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటులో సీతారాం ఏచూరి కీలక పాత్ర పోషించారని అన్నారు. దేశ అభివృద్ధికి ఆయన చేసినసేవలు, సూచనలు మరువలేనివి అన్నారు. గత 40సంవత్సరాలుగా దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించారని అన్నారు.దేశంలోప్రజలకు మేలు జరిగే చట్టాలు వచ్చాయి అంటే అందులో సీతారాం ఏచూరి కృషి మరువలేనిది అన్నారు.