ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అధిక శాతం వ్యవసాయ రైతులే ఉన్నారని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ అన్నారు. తాండూరు మండలం ఎల్మకన్నా సొసైటీ చైర్మన్, జిల్లా డైరెక్టర్ సంగెం రవీందర్ గౌడ్ ఆదివారం ఉమ్మడి జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్గా ఇబ్రహీంపట్నం చెందిన కొత్త కురువ సత్తయ్యను ఎన్నుకున్నారు.డీసీసీబీ చైర్మన్ గా పనిచేసిన బుయ్యని మనోహర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలలో తాండూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి డీసీసీబీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఖాళీగానే ఉన్నాయి. అయితే ఆదివారం చైర్మన్ గా సత్తయ్య,వైస్ చైర్మన్ గా రవీందర్ గౌడ్ ను ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఏకగ్రీవంగా డీసీసీబీ వైట్ చైర్మన్ గా ఎంపికైన రవీందర్ గౌడ్కు ఎన్నికల నిర్వహణ అధికారి టైటస్ పాల్ నియామక పత్రం అందజేశారు. తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నూతనంగా ఎన్నికైన సత్తయ్య,రవీందర్ గౌడ్ లకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఉమ్మడి జిల్లా,తాండూరుకు చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అధికారులు వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రవీందర్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఒక్క రైతు కూడా బాధపడకుండా చూడాల్సిన బాధ్యత పాలకవర్గం తీసుకుంటుందన్నారు. రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఇప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.సీఎం, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ,తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి , ఆర్బిఎల్ ఎండి బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగం కాలనీ మాజీ సర్పంచ్ మేఘనాథ్ గౌడ్,పలు సొసైటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు,మాజీ ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నారు.