నాభిశిల బొడ్రాయి మరియు ధ్వజస్తంభానికి నాలుగు లక్షలతో ప్రతిష్టాపన.
గ్రామ ప్రజల సహకారంతో మరో లక్ష రూపాయల చందా.
మూడు రోజులపాటు బాణాపూర్ లో అన్నదాన కార్యక్రమాలు.
మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్య్త విఠల్ నాయక్.
మీ న్యూస్ ప్రతినిధి:::వికారాబాద్ జిల్లా యాలాల మండలం బానాపూర్ గ్రామంలో గత మూడు రోజులపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్య్త విఠల్ నాయక్ కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు.
బాణాపూర్ లో మూడు రోజులపాటు పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గ్రామ శ్రేయస్సు కోసం నాభిశిల బొడ్రాయిని ప్రతిష్టాపించారు .అదేవిధంగా హనుమాన్ ఆలయం ఎదురుగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అశోక్ డ్యాన్స్ మాస్టర్ చే పోతురాజుల విన్యాసాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని మూడు రోజులపాటు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్య్త విఠల్ నాయక్ మాట్లాడుతూ గ్రామ శ్రేయస్సు కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు.గ్రామ నడిమద్యలో ప్రతిష్టించే పవిత్రమైన శిల,ఇది గ్రామానికి నాభి (బొడ్డు) వంటిదని, దుష్టశక్తుల నుండి ఊరిని రక్షించే గ్రామ దేవతగా భావిస్తారు. గ్రామ నిర్మాణం సమయంలో, కరువు కాటకాలు, అరిష్టాలు కలగకుండా ఉండేందుకు భవనీయ పూజారులచే ఈ రాయిని శాస్త్రోక్తంగా ప్రతిష్టాపించడం జరిగిందని వెల్లడించారు.ఊరి మధ్యలో కొలువై ఉండి రక్షణ కల్పిస్తుందన్నారు. గ్రామంలో అకాల మరణాలు, రోగాలు, క్షుద్ర శక్తులు ప్రవేశించకుండా ఈ రాయి అంగరక్షకుడిగా ఉంటుందని,.గ్రామంలో శుభకార్యాలు జరిగేటప్పుడు బొడ్రాయికి ప్రత్యేక పూజలు, ఉత్సవాలు (బొడ్రాయి పండుగ) జరుపుకుంటారు.ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు.ప్రతి ఒక్కరు భక్తి భవాని అలవర్చుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో బానాపూర్ సర్పంచ్ వినావత్ శంకర్ నాయక్ , తాండూర్ మున్సిపల్ 13వ వార్డు కౌన్సిలర్ సురేష్ నాయక్, మాజీ సర్పంచ్ బాబ్యా నాయక్, వార్డు మెంబర్లు ,గ్రామ పెద్దలు రాములు నాయక్, గోపాల్ రవి నాయక్ , మీదింటి శాకప్ప, రాజు నాయక్ రాజు తో పాటు వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.