ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం
మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ 9640659560
మీ న్యూస్ ప్రతినిధి మార్చి 8::అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో శనివారం సూర్యాపేట జిల్లా కోర్టు న్యాయ మూర్తులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కోర్టు న్యాయమూర్తులు ఇన్చార్జి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ డాక్టర్ ఎం శ్యాంశ్రీ, డిస్టిక్ లీగల్ సెల్ అథారిటీ సెక్రెటరీ పి.వాణి, సీనియర్ సివిల్ జడ్జ్ పర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ గోపు రజిత, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ అపూర్వ రవళి లను బొకేలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ జిల్లా గౌరవ అధ్యక్షులు నాతి సవేంద్ర కుమార్, అధ్యక్షులు బొమ్మ గాని శ్రీనివాస్, కార్యనిర్వాహక అధ్యక్షులు తాళ్లపల్లి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి తొగిటి మురళి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ గుగులోతు రాజారాం, ఉపాధ్యక్షులు తాజు ద్దీన్,కుమారస్వామి, వెంకటేశ్వర్లు,బానోతు సతీష్ బానోతు ప్రతాప్, వజీర్, ఓర్సు రాజు లు న్యాయాధికారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.