⏩::ఎస్సారెస్పీ కాల్వ ద్వారా నీళ్లు రాకపోవడంతో ఎండిపోయిన వరి పొలాలు
⏩::వరి పొలాలకు తక్షణమే నీటిని విడుదల చేయాలని
⏩::రైతాంగం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడి ఎండిపోయిన పొలాలకు నష్టపరిహారం అందించాలి
⏩::మొగ్గయగూడెంలో ఎండిన వరి పొలాలను పరిశీలించిన గ్రామీణ పేదల సంఘం నాయకుల
మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ 9640659560
మీ న్యూస్ ప్రతినిధి : మార్చి 2 :: చివ్వేంల ఎస్సారెస్పీ కాల్వ ద్వారా నీళ్లు రాక ఎండిపోయిన పొలాలకు తక్షణమే నీటిని విడుదల చేయాలని గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలోఆదివారం మండలంలోని మొగ్గయగూడెంలో కొనకoచి కళమ్మ రైతు పొలాన్ని పరిశీలించారు. కొనకంచి కళమ్మ కు చెందిన పది ఎకరాల పొలం నీళ్లు లేక ఎండిపోవడంతో గొర్లు, పశువులు మేస్తున్న ఘటనను చూసి చలించిపోయారు. అనంతరం ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ…. మండలంలోని అన్ని గ్రామాల్లో ఎండిపోతున్న వరి పొలాలకు ఎస్ఆర్ఎస్పి నీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎండిపోయిన పొలాలకు ఎకరాకు రూ. 30 వేల నష్టపరిహారం చెల్లించాలని కోరారు. రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే అన్నారు. రైతాంగం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడి ఎండిపోయిన పొలాలకు ప్రభుత్వం సర్వే చేయించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోత దశకు వచ్చే సమయంలో పంటలకు నీరు లేక చేతికి వచ్చిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు కాల్వ ద్వారా నీటిని విడుదల చేస్తే కొంతవరకు పంటను కాపాడుకోవచ్చని అన్నారు. అధికారులు సర్వే చేసి ఎండిపోయిన పొలాలకు తక్షణమే సాయం అందించాలని అన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధర్నా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి కొనకంచి వీరభద్రయ్య, ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ జిల్లా కార్యదర్శి భాష్పంగి సునీల్, వాసు, నాయకులు అనంతుల యల్లయ్య, వీరబోయిన వెంకన్న, ఆబిమల్ల వెంకన్న, నారాయణ రెడ్డి, భూక్య వెంకన్న, వెంకట్ రావు, సుమన్, అశోక్, వాల్య, లాలు, ప్రసాద్, చక్రు తదితరులు పాల్గొన్నారు.