మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఫిబ్రవరి 19::దురాజ్ పల్లి లోని పెద్ద గట్టు జాతరలో గత 4 రోజులుగా,జాతర విజయవంతం చేసేందుకు జిల్లా, మండల అధికారులతో పాటు జర్నలిస్టుల పాత్ర కూడా చాలా ఉంది. జాతరలో అధికారులకు ఉన్న స్వేచ్ఛ, అధికారం.. జర్నలిస్టులకు లేదు.. వార్త సేకరణలో భాగంగా ఫోటో తీయడానికి పోలీస్ ల ఆంక్షలు.. బైక్ మీద వెళ్తుంటే పోలీస్ ల అంక్షలే.. అదే అధికారులు విధుల పేరుతో జాతరలో వారి వారి కుటుంబ సభ్యులతో బైక్, కారు లో తిరగవచ్చు. వార్త సేకరణ కోసం జర్నలిస్టులు బైక్ పై వెళ్ళకూడదు.. ఏకంగా ఒక కారు జాతర ప్రధాన ద్వారం గుండా మర్రి చెట్టు దగ్గరనుండి ముందుకు వచ్చి దారి మధ్యలో పార్కింగ్ చేశారు. ఈ కారు ఎవరిది కానీ అదే పోలీస్ లకు కనిపించట్లాదా.? ఆ కారు వల్ల అక్కడ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది .. అయిన పోలీస్ లకు ఇది కనిపించడం లేదా ?