ముఖ్యమంత్రికి ధన్యవాదాలు నార్త్ హైదరాబాద్ మెట్రో రైల్ సాదన సమితి ముఖ్య సబ్యుడు డా. ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్
హైదరాబాద్ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ NVS రెడ్డి.
ఎంపీ ఈటెల రాజేందర్.
ఎమ్మెల్యే కే వివేకానంద గౌడ్.
ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి
సత్కరించిన కైటియ (KITEA) అద్యక్షుడు లాస్య ఇన్ఫోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ డా. ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్
ఇది ప్రజల విజయం, ప్రజాస్వామ్యంలో ప్రజలు తలుచుకొంటే ఏదైనా సాద్యం – కైటియ (KITEA) అద్యక్షుడు – డా. ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్
మీ న్యూస్ ప్రతినిధి జనవరి 2
హైదరాబాద్ (02-01-2025): నార్త్ హైదరాబాద్ మెట్రో రైల్ సాధన సమితి (NHMRSS) గత రెండు సంవత్సరాల నుండి చేస్తున్న ప్రయత్నాలు ఫలించి మరియు ఉత్తర హైదరాబాద్ కు అందని ద్రాక్షగా ఉన్న ప్యారడైజ్- మేడ్చల్, జేబీఎస్ – శామీర్ పేట్ వరకు మెట్రో రైల్ విస్తరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన సంవత్సర కానుకగా అందించడం పట్ల నార్త్ హైదరాబాద్ మెట్రో రైల్ సాదన సమితి ముఖ్య సబ్యుడు మరియు కైటియ అద్యక్షులు డా. ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డా. ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్ మాట్లాడుతూ హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ -2 లో భాగంగా ప్యారడైజ్-మేడ్చల్ (23 కిలోమీటర్లు), జెబీఎస్-శామీర్ పేట్ (22 కిలోమీటర్లు) మెట్రో రైల్ కారిడార్లకు డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) చేసేలా అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం పట్ల ఉత్తర హైదరాబాద్ ప్రజలకు పండుగ వాతావరణం ఏర్పడిందని హర్షం వ్యక్తం చేసారు. ఈ మెట్రో రైల్ విస్తరణతో నార్త్ సీటీ మరింత వేగంగా అభివృద్ధి చెందడంతోపాటు తో పాటు, ఉత్తర తెలంగాణ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తోలగబోతున్నాయని విశ్వాసం వ్యక్తంచేశారు. డా. ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్ మాట్లాడుతూ, మెట్రో రైల్ కోసం ఇరవై ఇదు వేల మంది ఆన్ లైన్ పిటిసన్ సంతకాలు చేసారని మరియు గల్లి నుండి ఢిల్లీ వరకు ఉన్న నాయకులను అధికారులను కలిసి మెట్రో రైల్ యొక్క ఆవశ్యకతను వివరించి వినతిపత్రాలను అందించామని తెలియజేసారు. గతంలో కూడా కైటియ (కొంపల్లి ఇటి ఎంత్రేప్రేనుర్స్ అసోసియేషన్) ఇలాంటి ప్రయత్నాలు చేసి మేడ్చల్ లో గేట్వే ఐటి పార్క్ సాధించిందని గుర్తుచేసారు. నార్త్ హైదరాబాద్ మెట్రో రైల్ కోసం సంపూర్ణ మద్దత్తు ఇచ్చిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు శ్రీ ఈటెల రాజేందర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ పేపర్ కే పరిమితం కాకుండా త్వరగా అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగాలని తెలంగాణా మరియు భారత ప్రభుత్వాన్ని డా. ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్ కోరారు.