ప్రపంచవ్యాప్తంగా జరుపుకొని అతిపెద్ద పండుగ క్రిస్మస్

Uncategorized క్రిస్మస్ సెలబ్రేషన్ నల్లగొండ సూర్యాపేట

ప్రపంచవ్యాప్తంగా జరుపుకొని అతిపెద్ద పండుగ క్రిస్మస్

సూర్యాపేట మీ న్యూస్ ప్రతినిధి :::: ప్రపంచవ్యాప్తంగా కులమతాలకు అతీతంగా జరుపుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్ పండగని సూర్యాపేట డిఎస్పి రవికుమార్ తెలిపారు. బుధవారం క్రిస్మస్ పురస్కరించుకొని కాసింపేట బేతెస్త చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని కేక్ కట్ చేసి వృద్ధులకు, వితంతువులకు, చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అజ్ఞానం అంధకారం, అవివేకం, అనాలోచన ఇవన్నీ లోకంలో సంచరిస్తున్న సమయంలో, సమాజం అతలాకుతలం మవుతున్న సమయంలో దేవుడు మానవ శరీరధారియై ఈ లోకంలో సంచరించాడు అని తెలిపారు. క్రిస్మస్ సంబరం అనేది ఒక ప్రాంతం ఒక గ్రామం ఒక మండలం ఒక దేశానికి సంబంధించింది కాదని ప్రపంచవ్యాప్తంగా కుల మతాలకతీతంగా జరుపుకునే పండగ ఏదన్నా ఉన్నదంటే అది క్రిస్మస్ పండగ అని తెలిపారు. అలాంటి క్రీస్తు వేడుకల్లో మనం ఉండడం ఆనందదాయక అన్నారు. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని పాటలో చదువుకుంటామని, క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టిన కాలం, క్రీస్తుపూర్వం అంటే క్రీస్తు పుట్టక మునుపని, ఇప్పుడు క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టిన కాలంలో మనం ఉండడం ఆనందదాయకం గౌరవప్రదం అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి సతీమణి కవిత, బేటిష్ట మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బిషప్ దుర్గం ప్రభాకర్, హెప్సిబా, అనంతుల నాగరాజు తప్పెట్ల తిరుపతి మీసాల తీతు బుడిగ నాగరాజు ఆదిమాళ్ళ బాబు మామిడి వెంకన్న మామిడి కిరణ్ రామకృష్ణ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.