సంస్కరణలకు ఆద్యుడు అంబేద్కర్
-మల్కాపూర్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
-అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఆర్.సి గౌడ్..
దీక్షతెలుగు న్యూస్, తాండూరు :
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సంస్కరణలకు ఆద్యుడని మండల బీసీ సెల్ అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్కొనియాడారు. ఆదివారం తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో అంబేద్కర్ 133వ జయంతి పురస్కరించుకొని ఆయన విగ్రహానికి ఆర్.సి గౌడ్,మాజీ సర్పంచ్ విజయలక్ష్మి,షేక్ హసేన్, నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆర్.సి గౌడ్ మాట్లాడుతూ..అంబేద్కర్ బడుగు, బలహీనవర్గాలు, దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడని పేర్కొన్నారు. ఆయనలోని నాయకత్వ లక్షణాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బోయిని నర్సింలు, వెంకటేశం గౌడ్, రఘు గౌడ్,రుద్రప్ప, తులజప్ప, కార్తీక్, మాల గుండప్ప,అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.అలాగే మల్కాపూర్ గ్రామానికి చెందిన కార్తికేయన్ అనే యువకుడు ఏకంగా 5 ప్రభుత్వ ఉద్యోగలు సాధించిన సుభాషందర్భగా కార్తికేయన్ కు గ్రామ పెద్దలు సన్మానించారు.