జడ్ పియల్ (ZPL) క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ విజేతలకు నగదు ప్రొత్సహం అందించి బహుమతులు కాంగ్రేస్ నేత మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డా ఎ చెంద్రశేఖర్

మీ:: న్యూస్ అక్టోబర్ 18.. జహిరాబాద్ టౌన్: పట్టణంలో యం బాగా రెడ్డి స్టేడియం లో గత పది రోజులు గా నిర్వహించిన టెన్నిస్ బాల్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ క్రిడాకారులకు మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్ నలబై వేల రూపాయలు నగదు ప్రోత్సాహం అందించి అనంతరం బహుమతులు ప్రధానం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువకులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ కలిసి మెలిసి స్నేహభావంతో ఉండాలని తెలిపారు. గ్రామీణ ,పట్టణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొని ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావలని ఆకాంక్షించారు .ప్రస్తుత పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్యావంతులు చేయడంలో చూపించే శ్రద్ధ క్రీడలపై ఆసక్తి పెంపొందించడం పై కనబరచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడలపై మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం, ఏకాగ్రత లభిస్తోందని అన్నారు. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో ఉన్నత ఉద్యోగాలు సాధించవచ్చని అన్నారు. విజేతలను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు టోర్నమెంట్ నిర్వహించినందుకు నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ,కార్యకర్తలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.