కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు వెంటనే అమలు చేయాలి

Uncategorized తెలంగాణ నల్లగొండ రాజాకియం సూర్యాపేట
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు వెంటనే అమలు చేయాలి
 లేనియెడల ప్రజాగ్రహానికి గురికాక తప్పదు
 సిపిఎం గ్రామ శాఖ మహాసభలు 
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు

 

మీ::న్యూస్ ప్రతినిధి  మోతే: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను వెంటనే చిత్తశుద్ధితో అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు.శుక్రవారం మోతే మండల పరిధిలోని మోతే, రాఘవాపురం, బిక్య తండా, రాఘవాపురం ఎక్స్ రోడ్డు గ్రామాలలో జరిగిన సిపిఎం గ్రామ శాఖ మహాసభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్న నేటికీ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం పూర్తిస్థాయిలో అమలు కాలేదు అన్నారు. వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 12 వేల రూపాయలు ఇస్తామని చెప్పి నేటికీ ఇవ్వకపోవడం వేదాలు వ్యవసాయ కార్మికులను మోసం చేయడమేనని ఆరోపించారు.రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలు రేషన్ కార్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు అన్నారు,ఇందిరమ్మ పథకం కిందఇల్లు నిర్మిస్తామని ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తామని మాయమాటలు చెప్పారు తప్ప ఏ ఒక్క కుటుంబానికి ఇల్లు కట్టించలేదన్నారు.ప్రభుత్వ భూములలో వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు వెంటనే పాస్ పుస్తకం ఇవ్వాలని కోరారు. వృద్ధులు,వితంతువులు,వికలాంగులు,ఒంటరి మహిళలు కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారని వెంటనే కొత్త పింఛన్లు మంజూరు చేయాలని కోరారు.జమిలీ ఎన్నికల విధానానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం సరైన విధానం కాదు అని అన్నారు. 2029 నుంచి ఒకే దేశం- ఓకే ఎన్నిక విధానాన్ని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్ లో ప్రవేశపెట్టడం ఫెడరల్ స్ఫూర్తికివిరుద్ధమన్నారు.దేశంలో ప్రతిపక్ష పార్టీలన్నీ జమిలి ఎన్నికల పద్ధతి అనుకూలం కాదు అని చెప్తు వస్తున్నప్పటికీ బిజెపి ప్రభుత్వం మొండిగా వ్వహరిస్తుందని ఆయన విమర్శించారు. గత సంవత్సరం 10 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగాయని, వీటికి 2028 మళ్లీ ఎన్నికలు జరగవలసి ఉంది అన్నారు. అప్పుడే ఏర్పడిన ప్రభుత్వాలు ఒక సంవత్సరం లేదా అంతకంటే తక్కువ సమయం మాత్రమే అధికారంలో ఉంటాయన్నారు. హిమాచల ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, కర్ణాటక, తెలంగాణ, మిజోరాం, మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్, రాజస్థాన్ రాష్ట్రాలలో పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.కేంద్ర ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని మార్చుకొని మెజార్టీ ప్రజల, రాజకీయ పార్టీల నిర్ణయాన్ని గౌరవించాలని కోరారు.

సిపిఎం గ్రామ కార్యదర్శిల ఎన్నిక…సిపిఎం పార్టీ మోతే గ్రామ కార్యదర్శిగా దోసపాటి శ్రీనివాస్, రాఘవపురం గ్రామ కార్యదర్శిగా బూడిద లింగయ్య, రాఘవాపురం ఎక్స్ రోడ్ గ్రామ కార్యదర్శిగా బి.వెంకటేశం, బిక్య తండా గ్రామ కార్యదర్శి బానోతు వెంకన్న లను ఎన్నుకున్నారు.ఈ మహాసభలలో సిపిఎం మండల కార్యదర్శి ము లుకూరి గోపాల్ రెడ్డి, మండల కమిటీ సభ్యులు గుంట గాని ఏసు, కాంపాటి శ్రీను, కిన్నెర పోతయ్య, బూడిద లింగయ్య, నాగం మల్లయ్య, ఎస్ మల్లయ్య, చర్లపల్లి మల్లయ్య, దోసపాటి శ్రీను, బానోతు లచ్చిరాం, జంపాల స్వరాజ్యం, ములుకూరి మణెమ్మ, ఎర్రబోయిన మాల్సుర్,తదితరులు పాల్గొన్నారు.