పట్టణంలోని వివిహెచ్ఎస్ స్కూల్ నుంచి బసవన్న కట్ట, పాండురంగం టెంపుల్ పరిసరాలు
మీ న్యూస్ ప్రతినిధి ::
వికారాబాద్ జిల్లా, తాండూర్ పట్టణం: తాండూర్ మున్సిపల్ పరిధిలో స్ట్రీట్ లైట్ల నిర్వహణపై స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని వివిహెచ్ఎస్ స్కూల్ నుంచి బసవన్న కట్ట, పాండురంగం టెంపుల్ పరిసరాలు, 19వ వార్డు ప్రాంతాల్లో ఉదయం తొమ్మిది గంటలు దాటిన తర్వాత కూడా వీధి విద్యుత్ దీపాలు వెలుగుతుండటం ప్రజల్లో చర్చనీయాంశమైంది. మరోవైపు, రాత్రి 9 నుంచి 10 గంటల సమయాల్లో కొన్ని ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్లు వెలగకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “ఉదయం అయితే దీపాలు ఆఫ్ చేయరు.. రాత్రి అయితే వెలిగించరు.. అసలు మున్సిపల్ ఎలక్ట్రికల్ సిబ్బంది ఉన్నారా లేదా?” అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
స్ట్రీట్ లైట్ల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా విద్యుత్ వృథా అవుతోందని, రాత్రి సమయంలో చీకటి నెలకొనడం వల్ల ప్రజలకు భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.