తడి -పొడి చెత్తను వేరుచేసి  మున్సిపల్ వాహనాలకు అందివ్వాలి

Uncategorized మోతే సూర్యాపేట

తడి -పొడి చెత్తను వేరుచేసి  మున్సిపల్ వాహనాలకు అందివ్వాలి

మీ న్యూస్ ప్రతినిధి జూన్ 3:
100 రోజుల ప్రణాళిక లో భాగంగా 2 వరోజు సూర్యాపేట పట్టణంలోని కోమటి కుంట ఎస్.సి కాలనీ కమ్యూనిటీ హాల్ ప్రాంతంలో జరిగిన అవగాహాన కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ బి .శ్రీనివాస్ ,అధికారులు,సిబ్బంది పాల్గొని తడి-పొడి చెత్త ని వేరుచేయు విధానము ఫై గృహా యజమానులకు ప్రజలకు అవగహన కల్పించారు.
ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగు ఆయిన సౌకర్యాలు కల్పించుటకు గాను 100 రోజుల ప్రణాళిక ను అమలు చేస్తున్నది అని ఇట్టి ప్రణాళికలో భాగంగా నిర్దేశించిన అంశంల ఫై ప్రజలకు అవగాహన కల్పించుట జరుగుతుంది అన్నారు … 2 వ రోజు కార్యక్రమంలో భాగంగా విధులలో సంచరించు కుక్కల పట్ల జాగ్రత్తగా ఉండాలి అని చిన్న పిల్లలను కుక్కలకు దూరంగా ఉండేలా చూడాలి అన్నారు..పెంపుడు కుక్కలకు టీకా లు వేయించాలి అన్నారు,వార్డు లలో నీటి సరఫరా కు సంబంధించి క్లోరినేషన్ టెస్టు లు చేయడం జరిగింది,వార్డ్ లో నిరుపేద మహిళలను గుర్తించి స్వయం సహాయక సంఘము చేయుటకు ప్రతి పాధించ నయినది..స్ట్రీట్ వెండర్ సంఘలు చేయుటకు సర్వే చేయుట జరిగింది.వార్డు లో వ్యాపారాలు చేయు వాటిని గుర్తించుట జరిగింది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీ.ఇ.సత్యారావు,సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్లశ్రీనివాస్,ఏ.ఇ.తిరుమలయ్య,యేనేపల్లి యాదగిరి,టిఎంసి శ్వేత,ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్ శివ ప్రసాద్, 2 వ వార్డు అధికారీ శివాజి, సీవోలు ,ఆర్పీలు మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.

 

సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ 9640659560