ప్రతి ఉపాధ్యాయునికి బదిలీ 

Uncategorized మోతే సూర్యాపేట

ప్రతి ఉపాధ్యాయునికి బదిలీ 

 

 మండల విద్యాధికారి గోపాలరావు

బదిలీపై వెళ్లిన నిమ్మల శ్రీనివాస్ డి.వినోదభాయ్

 

సూర్య పేట్ జిల్లా ఇన్చార్జి ప్రతినిధి కోల రవీందర్ గౌడ్: ప్రతి ఒక్కరి ఉద్యోగ జీవితంలో బదిలీ అనేది సర్వసాధారణమని మోతె మండల విద్యాధికారి కే గోపాల్ రావు అన్నారు. ఎంఈఓ మాట్లాడుతూ మనం నిస్వార్ధంగా విద్యార్థుల ఉన్నతకై పాటుపడితే వారి తోపాటు వారి తల్లిదండ్రుల మనుషుల్లో కూడా మంచి స్థానాన్ని కలిగి ఉంటారని కాబట్టి ప్రతి ఉద్యోగి కూడా తన విద్యుక్త ధర్మాన్ని నిర్వహించాలని ఈ సందర్భంగా తెలియజేశారు… ప్రాథమిక పాఠశాల రాఘవాపురంలో పనిచేసి బదిలీపై వెళ్లిన నిమ్మల శ్రీనివాస్ డి.వినోదభాయ్ లకి ఈరోజు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మూల మంజుల అధ్యక్షతన సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లింగయ్య సురేష్, మాజీ సర్పంచి గుండాల గంగులు అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ కిష్టమ్మ గ్రామ యువకులు కిన్నెర పోతయ్య అంగన్వాడీ టీచర్స్ రోజా పార్వతి ధనమ్మ సవిత సతీషు ఎల్లమ్మ మల్లయ్య మొదలైన వారు పాల్గొన్నారు