జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, సూర్యాపేట లో జరుగుతున్న ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ పరీక్ష కేంద్రాన్ని

Uncategorized తెలంగాణ నల్లగొండ సూర్యాపేట

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, సూర్యాపేట లో జరుగుతున్న ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ పరీక్ష కేంద్రాన్ని

 

 

⏩::గురువారం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకస్మిక తనిఖీ చేశారు.

 

⏩::మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ 96406595 60 మార్చి 6

 

మీ న్యూస్ ప్రతినిధి::పరీక్ష నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించి, విద్యార్థుల హాజరు శాతం గురించి చీఫ్ సూపరింటెండెంట్ యాదయ్య ను అడిగి తెలుసుకున్నారు. సీ.సీ కెమెరా నిఘా నడుమ నిబంధనలకు అనుగుణంగా పరీక్ష నిర్వహించాలని, పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి, అత్యవసర వైద్య సేవల కేంద్రం ఏర్పాటు, మరుగుదొడ్లు, కళాశాలలో ఎలాంటి వ్యర్దాలు లేకుండా పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పరీక్ష పూర్తయిన వెంటనే జవాబు పత్రాలను పోలీసు బందోబస్తు మధ్య క్లోస్డ్ వాహనంలో నిర్దేశిత కేంద్రాలకు తరలించాలని సూచించారు. పరీక్షలు పూర్తి పారదర్శకంగా, పక్కాగా పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ వాచీలు వంటి ఉపకరణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించకూడదని, నిశిత పరిశీలనతో విద్యార్థులను అనుమతించాలని స్పష్టం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి మందులను పరిశీలించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎండలు బాగ ఉండటంవలన విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.జిల్లా లో ఈరోజు జరిగిన ఇంటర్మీడియట్ సెకండియర్ సెకండ్ లాంగ్వేజ్ పరీక్షలో 7695 విద్యార్థులకు గాను 7416 పరీక్షలకు హాజరయ్యారని 279 గైర్హాజరయ్యారని తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.