మీ న్యూస్ ప్రతినిధి::మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ గురువారం ఉదయం 8 గంటల నుండి 4 గంటల వరకు పోలైన ఓట్లు మహిళలు 11, పురుషులు 33, 44 పోలవగా, 4 గురు ఓటింగ్ లో పాల్గొనలేదు అని మొత్తం 48 ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి నాగలక్ష్మి తెలిపి అనంతరం మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగిందని అన్నారు.టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ పర్యవేక్షించిన ఇన్చార్ ఎమ్మార్వో వంశీ, సీఐ రామకృష్ణ రెడ్డి, ఆర్ ఐ లు మన్సూర్ అలీ, నిర్మల, ఎస్సై యాదవేందర్ రెడ్డి, రెవిన్యూ సిబ్బంది, పోలింగ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.