మీ న్యూస్ ప్రతినిధి మోతే ఫిబ్రవరి 18::మండల కేంద్రంలో లయోలా అకాడమీ సికింద్రాబాద్ కి చెందిన బి యస్సి వ్యవసాయ డిగ్రీ కోర్సు విద్యార్థినిలు సోమవారం పంటలో చీడ పురుగుల ఉపృతి తెలుసుకోనికి లింగాకర్షక బుట్టలను ఉపయోగించవచ్చు అని తేలిపారు .కాయ తొలుచు మరియు కాండం తోలుచు పురుగులు ఉనాకిని తెలుసుకోడానికి వాడుతారు.లింగాకర్షక బుట్టలోని ఎరకు మగపురుగులు ఆకర్షింపబడుతాయి.మగ పురుగులు బుట్టలో పడిపోవడం వలన సంతానాత్పత్తి తగ్గిపోవడం జరుగుతుంది.లింగాకర్షక బుట్టలను అన్ని రకాల పంటలలో వాడినట్లయితే పురుగులలో ఉధృతిని నివారించుకోవచ్చు.ఈ బుట్టలు వాడటం వలన రసాయనిక పురుగు మందుల వాడకం తగ్గుతుంది. తద్వారా రైతుకు సాగు చేసే కర్చు తగ్గుతుంది. అని విద్యార్ధులు వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధినీలు ఆశ్రిత , ప్రియాంక , వినిత , నందిని, శ్రీనిధి , గాయత్రి, రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.