ఈ నెల 15 లోపే పంచాయతీ ఎన్నికల షెడ్యూలు. మంత్రి పొంగులేటి
మీ న్యూస్ ప్రతినిధి మోతే ఫిబ్రవరి 3 ఫిబ్రవరి 15 లోపే పంచాయతీ ఎన్నికల షెడ్యూలు విడుదల అయ్యే అవకాశం ఉందని మంత్రి పొంగినేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఆయన ఖమ్మంలో మాట్లాడుతూ సర్పంచుల ఎన్నికలు వస్తున్నాయి.జాగ్రత్త అంటూ కార్యకర్తలకు సూచించారు బీసీ రిజర్వేషన్ల పెంపు పై కేంద్రం స్పందన ఎలా ఉన్న.రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటివారం లో ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ లపై ప్రజలలోకి తీసుకెళ్లాలని అలాగే రాష్ట్రంలో రాక్షస పాలన పొయ్యి ప్రజా పాలన వచ్చింది కాబట్టి గ్రామస్థాయి నాయకులు ప్రజలలో చైతన్యం నింపి కాంగ్రెస్ సైన్యం ముందుకు సాగాలని పంచాయతీ ఎన్నికలలో అన్ని గ్రామాలలో మన పార్టీ నాయకులు పంచాయతీ ఎన్నికలలో మన అభ్యర్థులకు అందుబాటులో ఉండి వారిని అధిక మెజార్టీ తో గెలిపించుకోవాలని తెలిపారు.