మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారి ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా
మీ న్యూస్ ప్రతినిధి :: మండల సమన్వయ కమిటీ సభ్యులు అనంతల ఆంజనేయులు మాట్లాడుతూఎత్తి పోతల పథకంలో సిబ్బందికీ పాతవారికి ఉత్తంకుమార్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకొమ్మటే మా మీద గుడ్డ కాల్చివేయటం సమంజసం కాదన్నారు. దొంగే దొంగ దొంగ అన్నట్లు ఉన్నదన్నారు. మేము సీఎం రిలీఫ్ ఫండ్. దళిత బంధు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఒకరి దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు నిరూపించిన నడిగూడెం నడిబొడ్డున ముక్కు నేలకు రాస్తామని ఔట్సోర్సింగ్ అనేది ప్రభుత్వ సంస్థ కాదని ప్రభుత్వం నిబంధన పాటించలేదని సంబంధిత మంత్రిగారు పాతవారికి ఐ టీ ఐ ఉంటే ఆపరేటర్లుగా. లేనివారికి వాచ్మెన్ గా లస్కర్లుగా అనుభవం ఉంటే ఎలక్ట్రిషన్లుగా తీసుకుంటామని మాట ఇచ్చారని అందుకోసం వారి సీనియార్టీని గుర్తించిపాత వారిని కొనసాగిస్తూ కొత్తవారిని తీసుకోమని అన్నామని. బి ఆర్ఎస్ ప్రభుత్వంలో గత ప్రభుత్వాలు కంటే ధాన్యాన్ని మూడింతలు ఉత్పత్తి చేసి దేశంలో తెలంగాణ నెంబర్ వన్ దాన్యకారంగా మార్చమని బి ఆర్ఎస్ ప్రభుత్వంలోని50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తే ఎటువంటి నోటిఫికేషన్ వెయ్యకుండా ఎగ్జామ్ నిర్వహించకుండా మేము ఇచ్చినాము అని చెప్పుకోవడం. ఒకరి కన్నబిడ్డలని మా బిడ్డలని చెప్పుకోవటమే కోదాడ నియోజకవర్గం లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి అనేది శిలాఫలకాలకే పరితమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో నడిగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు బోనగిరి ఉపేందర్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు దాసరి శ్రీనివాస్.మండల బి ఆర్ఎస్ పార్టీ నాయకులు బొల్లం శ్రీనివాస్ sk మౌలానా. ఎస్కే గౌస్.బుడే సాహెబ్. బడుగుల వెంకటేశ్. బి రవల్లి సుధాకర్ రెడ్డి. కలకొండ లక్ష్మయ్య. తదితరులు పాల్గొన్నారు