డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి పై మతోన్మాద అహంకారి అమిత్ షా వ్యాఖ్యలు దుర్మార్గం…

Uncategorized నల్లగొండ రాజాకియం సూర్యాపేట

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి పై మతోన్మాద అహంకారి అమిత్ షా వ్యాఖ్యలు దుర్మార్గం…

కేంద్ర మంత్రివర్గం నుండి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలి….

కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి…

మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 19 ::::: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వ్యవస్థలోని ప్రధాన భాగమైన పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ బద్ధంగా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై హోంశాఖ మంత్రిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన అమిత్ షా అంబేద్కర్ గారి పై అహంకారపూరితమైన వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని ఈ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరు ఖండించాలని, కేంద్రమంత్రి వర్గం నుండి ఆయనను వెంటనే భర్త రఫ్ చేయాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి డిమాండ్ చేశారు. పార్లమెంటులో అంబేద్కర్ గారి పై అమిత్ షా అహంకార పూరిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లాలబావి సెంటర్లో కెవిపిఎస్ ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత అహంకారంతో అంబేద్కర్ ఏమైనా దేవుడా! ఆయనను పదే పదే స్మరించడం కన్నా దేవుడిని స్మరిస్తే స్వర్గానికి వెళతారని అంబేద్కర్ ని అవమానపరిచే విధంగా వ్యాఖ్యానించడం దుర్మార్గమని అన్నారు.అమిత్ షా ను వెంటనే పార్లమెంటరీ సభ్యత్వం రద్దు చేయాలని, కేంద్ర హోం శాఖ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన హోం మంత్రి షా వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ పేరును పదే పదే పలకరిస్తే బాధగా ఉండే అమిత్ షాకు ఆయన ఏర్పాటు చేసిన రాజ్యాంగబద్ద మంత్రి పదవిలో ఎందుకు ఉన్నావని ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్రజలకు సమున్నత గౌరవాన్ని కల్పించే విధంగా రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు ఈ దేశంలో నిజమైన దేవుడు అని పేర్కొన్నారు. అంబేద్కర్ పట్ల ఆయన రచించిన రాజ్యాంగం పట్ల బిజెపికి ఉన్న వక్రబుద్ధి ఈ సందర్భంగా బయటపడిందని అన్నారు. అంబేద్కర్ పేరు లేకుండా చేసి ఆయన రచించిన రాజ్యాంగాన్ని, రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లను తొలగించాలని కుట్రలో భాగంగానే అమిత్ షా వ్యాఖ్యానించారని తెలిపారు. రాజ్యాంగం స్థానంలో మనువాదాన్ని ప్రవేశపెట్టి దళిత,గిరిజనులను, ప్రజాస్వామ్య శక్తులను ఈ దేశంలో మనుగడ లేకుండా చేయాలని కుట్రలో భాగంగానే అమిత్ షా అహంకారపూరిత మాటలు మాట్లాడారని అన్నారు. అమిత్ షా వ్యాఖ్యలను ప్రతి ఒక్కరు ఖండించాలని పిలుపునిచ్చారు. మనువాద కేంద్ర ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా,రాజ్యాంగ రక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా పోరాటాలు ఉధృతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మాజీ జిల్లా కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టిపల్లి సైదులు కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పిండిగ నాగమణి సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం రాంబాబు, ఎన్పిఆర్డి జిల్లా అధ్యక్షులు అరవపల్లి లింగయ్య నాయకులు కృష్ణారెడ్డి శ్రీలత విగ్నేష్ వంశీ తదితరులు పాల్గొన్నారు.