స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మున్నూరు కాపుల మద్దతు
హుజూర్ నగర్ లో త్వరలో మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం
మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి కోలా నాగేశ్వరరావు
మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 15
హుజూర్ నగర్/ సూర్యాపేట తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మున్నూరు కాపుల మద్దతు ఉంటుందని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోల నాగేశ్వరరావు, శాసనాల నాగ సైదయ్య, కామిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటుచేసిన మున్నూరు కాపు సమావేశంలో వారు మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన విధంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లోను కాంగ్రెస్ పార్టీకి మున్నూరు కాపు సంఘం పూర్తి మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. కొంతమంది వ్యక్తిగత స్వార్థంతో కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారని, వ్యక్తిగత ప్రయోజనాల కన్నా మున్నూరు కాపు సంఘ ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. మున్నూరు కాపులు రాజ్యాధికారం సాధించేందుకు ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మున్నూరు కాపు మిత్రులు పనిచేయాలని పిలుపునిచ్చారు. మున్నూరు కాపులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తుందని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం మున్నూరు కాపులు నిరంతరం కృషి చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మున్నూరు కాపులకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కీలకమైన పదవులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రంలో , రాష్ట్రంలో మంత్రులుగా మున్నూరు కాపు ఎంతో మందికి పదవులు ఇచ్చిందని, పార్లమెంటు, రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించిందన్నారు. రాష్ట్రంలోని ఇతర కులాలకు ఏర్పాటు చేసిన విధంగానే మున్నూరు కాపులకు కార్పొరేషన్ ప్రకటించిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ మున్నూరు కాపులకు న్యాయం చేస్తున్న నమ్మకం ఉన్నదని అన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి, సహకార సంఘం ఎన్నికల తో పాటుగా మున్సిపల్ ఎన్నికల్లోను కాంగ్రెస్ పార్టీకి మున్నూరు కాపులు మద్ధతు ఉంటుందన్నారు. *తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ గా పుంజాల అలేఖ్య, ప్రభుత్వ విప్ గా ఆది శ్రీనివాస్ కు* అవకాశం కల్పించి సముచిత స్థానం కల్పించారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మున్నూరు కాపులకు నామినేట్ పదవుల్లో అవకాశం కల్పించనున్నదని తెలిపారు.
*హుజూర్ నగర్ లో త్వరలో నియోజకవర్గ స్థాయిలో మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆత్మీయ సమ్మేళనంకు రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి దంపతులను ఆహ్వానించనున్నట్లు* వెల్లడించారు. మున్నూరు కాపుల అభివృద్ధికి *మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి* ఎంతో కృషి చేశారని తెలిపారు.
సమావేశంలో మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు కాసర్ల నాగేశ్వరరావు, ఆవుల వెంకటయ్య, కడియం శ్రీనివాసు, కాల్వ లక్ష్మయ్య, కాల్వ పెద్ద వెంకటేశ్వరరావు, కాలవ చిన్న వెంకటేశ్వరరావు, ఆవుల సతీష్, అమరోజు గోపయ్య, ఎలిశెట్టి వెంకటేశ్వరావు, తోట నరసింహారావు పాల్గొన్నారు.