మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 6::మోతె రాజ్యాంగ స్ఫూర్తి తో ప్రతి ఒక్కరు అభివృద్ది చెందాలని యం పి డి ఓ ఆంజనేయులు యస్ ఐ యాదా వెందర్ రెడ్డి లు అన్నారు శుక్రవారం మండల కేంద్రం లోని పల్లెల పరివర్తన సొసైటీ చైర్మన్ లక్ష్మణ్ పల్లెల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బి అర్ అంబేద్కర్ 68 వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ దేశం కోసం దేశ ప్రజల కోసం అహర్నిశలు శ్రమించి రాజ్యాంగాన్ని రచించి ప్రతి ఒక్కరి కి విద్యా వైద్య ఆరోగ్య.ఆర్థిక. రాజకీయ స్వాతంత్ర్యాన్ని అందించటం జరుగిందని అన్నారు రాజ్యాంగం కల్పించిన హక్కులను దుర్వినియోగం చేయవద్దని కోరారు ఈ కార్యక్రమం PDSU రాష్ట్ర కార్యదర్శి విప్లవరాజ్ ఏఐడబ్ల్యుసి కాంగ్రెస్ పార్టీ జిల్లా చైర్మన్ దోసపాటి చిరంజీవి పరివర్తన సొసైటీ గౌరవ అధ్యక్షులు పల్లెల రాము మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెలుగు వీరన్న కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు గడ్డం రామ్ రెడ్డి మాజి ఉప సర్పంచ్ డి రాములు బొక్క ఉపేందర్ రెడ్డి గ్రామ పంచాయితీ కార్యదర్శి బక్కయ్య బొడ్డు సాలయ్య నర్సయ్య డి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు