ఒకరు తప్పు చేస్తే::: కాలనీలో అందరికీ ఇబ్బంది 

Uncategorized తాండూర్ వికారాబాద్

ఒకరు తప్పు చేస్తే::: కాలనీలో అందరికీ ఇబ్బంది 

 

మురుగు కాలువలు నిండి రోడ్లపైకి 

కాలువలను శుభ్రం చేశారా తప్ప ఎలాంటి చర్యలు లేవు 

 

తాండూర్ మున్సిపల్ పరిధిలో చోటుచేసుకుంది

 

మీ న్యూస్ ప్రతినిధి :::ఒకరు చేసే నిర్మాణ పనికి అడ్డు చెప్పక వారు చేసే పని వల్ల మురుగు కాలువలు నిండి రోడ్లపైకి వచ్చి ఇతరులకు ఇబ్బంది పెడుతున్నాయి. సంబంధిత శాఖ అధికారులకు సమాచారం ఇస్తే కూడా పనిని ఆపాక ప్రజాధనంతో మురుగు కాలువలను శుభ్రం చేశారా తప్ప ఎలాంటి చర్యలు చేపట్టాలేరు ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలో చోటుచేసుకుంది. తాండూర్ మున్సిపల్ పరిధిలోని ఆదర్శ తులసి నగర్ గణపతి దేవాలయ సమీపంలో ఓ భవన నిర్మాణం జరుగుతుంది అయితే ఆ భవన నిర్మాణం వల్ల ఆ కాలనీలో ఉన్న మురుగు కాలువలో సిమెంట్ బస్తాలు ఇసుక పడి మొత్తం మరుగు కాలువలు నిండుకొని రోడ్లపైకి వచ్చాయి దీంతో స్థానిక ప్రజలకు దుర్వాసన రావడంతో తీవ్ర ఇబ్బంది కలిగింది. ఈ విషయంపై సంబంధిత మున్సిపల్ అధికారులకు స్థానిక ప్రజలు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు ఎక్కువ రావడంతో మున్సిపల్ అధికారులు జెసిబి యంత్రాన్ని పంపించి మరువ కాలువలను కొంతమేర శుభ్రం చేసి చేతులు దులుపుకున్నారు. కానీ ఎలాంటి చర్యలు చేపట్టలేరు. దీనిపై మున్సిపల్ అధికారులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.