సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నుండి అంగన్వాడి టీచర్లను మినాయింపు ఇవ్వాలని
కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నుండి అంగన్వాడి టీచర్లను మినాయింపు ఇవ్వాలని సిఐటియు డిమాండ్
మీ న్యూస్ ప్రతినిధి:::తాండూరు పట్టణంలో మున్సిపల్ పరిధిలో అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు తాండూర్ పట్టణ మున్సిపల్ కమిషనర్‌కి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నుండి మినాయింపు ఇవ్వాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తూ అంగన్వాడీ టీచర్స్ ని శ్రమ దోపిడీ చేస్తూ అనేక ప్రభుత్వ సర్వేలకు పనులకు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ని ఉపయోగించుకొని వారిపై పని బారాన్ని పెంచుతున్నారని అంగన్వాడీ టీచర్స్ కు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పేరుతో అంగన్వాడీ టీచర్స్ ని సర్వే చేయాలని ఆదేశించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఐసిడిఎస్ పనిభారం అధికంగా ఉండడంతో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేయడానికి తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని చిన్నపిల్లలు బాలింతలు గర్భిణీ స్త్రీలు ఐసిడిఎస్ గ్రోత్ తదితరు పనిభారలతో తీవ్ర ఇబ్బందులు సతమతమవుతున్న టీచర్లకు ప్రభుత్వ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నుండి మినయింపు ఇవ్వాలని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ కనీస వేతనాలు 26 వేలు అమలు చేయకుండా ఉద్యోగ భద్రత కల్పించకుండా ఈ ఎస్ ఐ పి ఎఫ్ సౌకర్యం కల్పించకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నుండి డిమాండ్ చేయడం జరిగింది అంగన్వాడీ టీచర్స్ సెక్టర్స్ యూనియన్ నాయకులు సుజాత తిరుమల కల్పన సంధ్యారాణి వసంతమాల అమృత లక్ష్మి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.