చెంగోల్లో శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు
– శివాజీ చిత్రపటానికి నివాళులర్పించారు
– నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలి : రాము
దీక్షతెలుగున్యూస్, తాండూరు :
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.తాండూరు మండలం చెంగోల్ గ్రామంలో స్వామి వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు రాము యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్బంగా రాము మాట్లాడుతూ..చత్రపతి శివాజీ మహారాజ్ ను నేటి యువతరం యువకులు ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో ముందుకెళ్లాలని రాము పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాకేష్ గౌడ్, హన్మయ, నారాన్ రెడ్డి,లక్ష్మి కాంత్ రెడ్డి,మల్లేష్,నరేష్,బలరాజ్,నర్సింహులు,చిన్న,వెంకట్,ఉషప్ప,మహిపాల్,అనిల్ తదితరులు పాల్గొన్నారు