మీ:: న్యూస్ ప్రతినిధి కోల రవీందర్ గౌడ్::మోతే మండల కేంద్రంలోని శ్రీ శాంతినికేతన్ స్కూల్ నందు ముందస్తు బతుకమ్మ సంబరాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు రంగు రంగుల పూలతో ఆనందంగా అలంకరించి బతుకమ్మలతో చిన్నారులు బతుకమ్మ పాటలు పాడుతూ ఆడారు చిన్నారులు టీచర్లు కలిసి చేసిన కోలాట నృత్యాలు ఆకట్టుకున్నాయి స్కూల్ కరెస్పాండెంట్ దోసపాటి ఎల్లయ్య మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలకు నిలువుద్దమని బతుకమ్మ సంబరాలు అని అన్నారు బ్రతుకు నిచ్చే అమ్మ బతుకమ్మ అని బతుకమ్మను కొనియాడారు బీరప్ప పూలలతో బతుకమ్మను అలంకరించి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందని తెలంగాణ ఆడపడుచులు అందరూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా సంతోషంగా జరుపుకునే పెద్ద పండుగ బతుకమ్మ అని అన్నారు విద్యార్థులు మన సంస్కృతిక సంప్రదాయాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు దోసపాటి రాములు స్కూల్ డైరెక్టర్ ఉప్పుల ఉప్పయ్య స్కూల్ టీచర్ దోసపాటి గోవర్ధన్ కోలరాధిక సుజాత సుధారాణి హా మీద ఉమా చిట్యాల సరిత పిచ్చయ్య ఎల్లమ్మ విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు