సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్:: మునగాల L 30- 31 జయ భారతి లిఫ్ట్ ఇరిగేషన్ కొక్కిరేణి. లిఫ్ట్ లో కరెంటు సమస్య తీవ్రంగా ఉన్నందున ఈరోజు హుజూర్నగర్ D.E.E (Transco) వెంకటకృష్ణ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
L30-31 లిఫ్ట్ ఇరిగేషన్ లో ప్రభుత్వ ట్రాన్స్ఫార్మర్ లో CT,PT కాయలు, కేబులు వైర్ దెబ్బతినడం వల్ల కరెంటు సప్లై సరిగ్గా రాక మోటార్లకు సరిపడా కరెంటు అందక నడవడం లేదు. వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఉన్నది. కావున తక్షణమే CT,PT కాయలు A B స్విచ్ కేబుల్ వేసి పంటలను రక్షించాలని. D. E.E వెంకట కృష్ణ కలవడం జరిగింది.
డి ఈ ట్రాన్స్కో వెంటనే స్పందించి మరమ్మతులు చేపడతామని కరెంటు అధికారులతో మాట్లాడి హామీ ఇవ్వడం జరిగింది . ఈ కార్యక్రమంలో లిఫ్ట్ చైర్మన్ మేదరమెట్ల వెంకటేశ్వరరావు. రైతు సంఘం రాష్ట్ర నాయకులు పల్లె వెంకటరెడ్డి. మాజీ సర్పంచ్ రావులపెంట వెంకన్న మాజీ ఉపసర్పంచ్ రావులపెంట బ్రహ్మం రైతులు నందిగామ సైదులు వట్టేపు సైదులు .పొస బోయిన హుస్సేన్ తదితర రైతులు పాల్గొన్నారు..