డిజె సౌండ్ కు అనుమతి లేదు టౌన్ సిఐ జి రాజశేఖర్

Mothe క్రైమ్ తెలంగాణ నల్లగొండ సూర్యాపేట

డిజె సౌండ్ కు అనుమతి లేదు టౌన్ సిఐ జి రాజశేఖర్

 వినాయక మండప నిర్మాణ సభ్యులకు సమావేశం

 వినాయక నిమజ్జనంలో డీజే అనుమతి లేదు

 డిజె సౌండ్ పెడితే కేసు నమోదు చేస్తాం 

 పట్టణ సీఐ రాజశేఖర్

 మీ: న్యూస్ ప్రతినిధి==సూర్యాపేట సబ్ డివిజన్ డిఎస్పీ ఉత్తర్వుల మేరకు సూర్యాపేట టౌన్ సిఐ జి రాజశేఖర్ డీజే సౌండ్ సిస్టమ్ నిర్వాహకులకు, డీజే సౌండ్ సిస్టం ఓనర్లను పోలిస్ స్టేషన్ కి పిలిచి ప్రత్యేక సమావేశం నిర్వహించారు, ఎట్టి పరిస్థితిలో గాని డీజే అనుమతులు ఇవ్వడం జరగదు, డీజే సౌండ్ సిస్టం పై నిషేధం అని తెలియపరచనైనది, గణేష్ మండపాల వద్ద, నిమజ్జనం ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టం లను పెట్టి కిరాయికి ఇచ్చి, ఇట్టి నియమాలు అతిక్రమించి ఎవరైనా డీజే సిస్టం పెట్టినచో వారిపై కేసు నమోదు చేసి డీజే సిస్టం సీజ్ చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడును అని తెలియ చేయనైనది, వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. తదుపరి వారిని సూర్యాపేట తాసిల్దార్ లో బైండోవర్ చేయడం తెలిపారు

ఈ జి రాజశేఖర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది వినాయక మండపాల సభ్యులు డీజే యజమానులు తదితరులు పాల్గొన్నారు