మాజీ సర్పంచ్ లకు పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలి
calendar_today
June 2, 2025
person
meenewstelugu
మాజీ సర్పంచ్ లకు పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలి
⏩:-అప్పుల బాధల నుంచి మాజీ సర్పంచ్ కు విముక్తి కల్పించాలి
⏩:- రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మాత్యులు సీతక్కకు
⏩:- సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు
మీ న్యూస్ ప్రతినిధి:-మోతే: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12769 మంది మాజీ సర్పంచులకు గత 18 నెలలుగా పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మాత్యులు సీతక్కకు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షలాది రూపాయలు అప్పుగా తెచ్చి గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు చేసిన మాజీ సర్పంచులకు గత 18 నెలలుగా చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అనేకమంది మాజీ సర్పంచ్ నిరుపేద కుటుంబాలకు చెందిన వారన్నారు. అప్పులు తెచ్చి కొద్దిమంది, భార్యల మెడలో ఉన్న బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని తెచ్చిన అప్పులకు వడ్డీలు అధికం కావడంతో చేసేది మీ లేక ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక పోరాటాల ద్వారా ఇటీవల153 కోట్ల రూపాయలు గ్రామపంచాయతీలకు విడుదల అయ్యాయని ఆ డబ్బును మాజీ సర్పంచులకు ఇవ్వకుండా సంవత్సర కాలం క్రితం పనులు చేసిన వాటికి కేటాయించడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వెంటనే కలగజేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించి పెండింగ్ లో ఉన్న మాజీ సర్పంచుల బిల్లులను చెల్లించాలని కోరారు. మాజీ సర్పంచులు చేస్తున్న పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందన్నారు.