మీ న్యూస్ ప్రతినిధి:::పురుటు నోప్పులతో బాధపడుతూ డెలివరీ కోసం తాండూర్ కు వస్తున్న గర్భిణి మార్గమధ్యంలో 108 లో ప్రసవం కావించి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ప్రసవం చేసిన 108 సిబ్బందిని గర్భిణి బంధువులు అభినందించారు. వివరాలకు వెళ్తే వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం గూడెంపల్లి గ్రామానికి చెందిన నర్సమ్మ నిండు గర్భిణీ ప్రసవం కోసం పురుటునప్పులతో బాధపడుతుండగా 108 సిబ్బందికి బంధువులు సమాచారం ఇచ్చారు. దీంతో 108 సిబ్బంది ఆమెను జిల్లా మాత శిశు ఆసుపత్రి తాండూర్ కి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఉడుమేశ్వరం దగ్గర పురూటు నొప్పులు అధికంగా కావడంతో అంబులెన్స్ సిబ్బంది గమనించి గర్భిణీకి ప్రసవం అయ్యే విధంగా చేయడంతో గర్భిణీ నర్స్సమ్మ ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారు. చికిత్స నిమిత్తం మాత శిశువు ఆసుపత్రికి 108 సిబ్బంది తరలించారు ప్రసవం సజావుగా జరిగినందుకు 108 సిబ్బంది అయినా గడుసు ప్రకష్ , శ్రీధర్ ను ఆ కుటుంబ సభ్యులు అభినందించారు