పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించాలి. ఘనంగా ఫెర్ వెల్ పార్టీ సంబరాలు..

Uncategorized

 

పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించాలి..
-ఘనంగా ఫెర్ వెల్ పార్టీ సంబరాలు..
-వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అహుతులను ఆకట్టుకున్నాయి
-ఐనెల్లి మాజీ సర్పంచ్ సప్న జ్యోతి, పాఠశాల ప్రిన్సిపాల్ ప్రకాశం గౌడ్

దీక్షతెలుగు న్యూస్,
తాండూరు :

విద్యార్థులు ఒత్తిళ్లకు లోనుకాకుండా.. పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించి.. పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని మాజీ సర్పంచ్ స్వప్న జ్యోతి, ప్రిన్సిపాల్ ప్రకాశం గౌడ్ లు సూచించారు.చదువులమ్మ ఒడిలో ఒక్కటిగా చేరిన నేస్తాలు వీడలేక వీడ్కోలు చెప్పుకున్నారు. మరిన్ని పెద్ద చదువులు చదివి మెరుగైన భవిష్యత్‌ను సాధించుకునే దిశగాకష్టమైనాసరేఇష్టంగానేటాటాచెప్పుకున్నారు.తాండూరు మండలం జినుగుర్తి గ్రామ సమీపంలో కొనసాగుతున్న తెలంగాణ ఆదర్శ పాఠశాల కళాశాలలో గురువారం ప్రిన్సిపల్ ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో ఫెర్ వెల్ పార్టీ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ఐనెల్లి మాజీ సర్పంచ్ స్వప్న జ్యోతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ స్వప్న జ్యోతి మాట్లాడుతూ..విద్యార్థులు ఉత్సాహంగా గడిపారు. విద్యార్థులు ఒత్తిళ్లకు లోనుకాకుండా.. పరీక్షలు బాగా రాసి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించి.. పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. టెన్త్, ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నత చదువులు చదువుతూనే ఉద్యోగాన్వేషన్లో ఉండాలన్నారు. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగుపరుచు కోవాలన్నారు. అనంతరం విద్యార్థుల స్కాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలోపాఠశాల వైస్ ప్రిన్సిపల్ నర్సింలు, న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డి, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.