ప్రజలను గాలి కోదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

Uncategorized నల్లగొండ రాజాకియం సూర్యాపేట

ప్రజలను గాలి కోదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

 కోదాడ హుజూర్నగర్ ప్రజలు కన్న బిడ్డలన్నారు

 కన్న బిడ్డలను వదిలేసి హైదరాబాదులో మకాం వేశారు

 ఓట్లప్పుడు కోట్లు గుమ్మరించిన నాయకులు నేడు జాడలేరు

 వరద బీభత్సంతో పూట గడవని స్థితిలో జనం ఉన్నారు

 వరద బాధితులకు వెంటనే నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలి

ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నష్టపరిహారాన్ని ఇప్పించాలి

 నాయకుల ఇండ్లలో కాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

 నెమలిపురి గురుకుల పాఠశాల విద్యార్థుల సమస్యలు కనిపించడం లేదా

ఆదుకోవడం అంటే పాత బట్టలు వసూలు చేయడమా….ఇచ్చేవారు ఎవరు

 క్షేత్రస్థాయిలో ఉండి అధికారులతో పని చేయించాలి

 కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలిచామ్

 రాజకీయాలకతీతంగా ప్రజలను ఆదుకోమని డిమాండ్ చేస్తున్నాం

 

బిఆర్ఎస్ పార్టీ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఘాటు విమర్శలు

 మీ:: న్యూస్ ప్రతినిధి::   వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్  ఘాటుగా విమర్శించారు. ఆదివారం కోదాడ పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కోదాడ, హుజూర్నగర్ ప్రజలు అన్న బిడ్డలని ఎన్నికలకు ముందు ప్రచారాలు చేసుకొని గెలిచిన తర్వాత కన్న బిడ్డలను గాలికి వదిలేసి హైదరాబాదులో మకాం వేశారని విమర్శించారు. కోదాడ ప్రజలు వరద బీభత్సంలో చిక్కుకొని నీళ్ల కోసం తిండి కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాబోయే ముఖ్యమంత్రి నాని చెప్పుకుంటున్న మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నష్టపరిహారం ఇప్పించడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు ముఖ్యమంత్రితో మాట్లాడి వెంటనే ప్రజలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు వరద నష్టాన్ని నాయకుల ఇండ్లలో కూర్చొని కాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవంగా నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందించాలన్నారు. నెమలిపురి గురుకుల పాఠశాల విద్యార్థులు మంచినీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నారని ఇది నాయకులకు కనబడట్లేదని ప్రశ్నించారు పట్టణంలో పారిశుధ్యం లోపించిందని దోమలు స్వైర వ్యవహారం చేస్తూ ప్రజలంతా అంటువ్యాధులతో జ్వరాలతో మంచానపట్టారని ప్రభుత్వ వైద్యశాలలో రక్తం రిపోర్టర్ రావడానికి రోజుల తరబడి పడుతుందని పట్టించుకోవాల్సిన నాయకులు జాడ లేకుండా పోయారని ఘాటుగా విమర్శించారు కరోనా సమయంలో కోదాడ ప్రజలకు అండగా నిలబడి ప్రైవేట్ ఉద్యోగులకు వేతనాలు లేక పూట గడవని స్థితిలో ఉన్న సమయంలో నిత్యవసర సరుకులను అందజేసే ఆదుకున్నామని గుర్తు చేశారు. ప్రజా ప్రతినిధులు స్థానికంగా ఉంటే అధికారులు సమర్థవంతంగా పనిచేస్తారన్నారు. సుమారు 15 16 వేల ఎకరాల్లో వరి పంట నష్టం జరిగిందని రాజకీయాలకతీతంగా నష్టపరిహారాన్ని చెల్లించాలని టిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కోదాడ పట్టణ అధ్యక్షులు నయీమ్, మండల పార్టీ అధ్యక్షులు అక్కెనపల్లి జానకి రామాచారి, నల్ల భూపాల్ రెడ్డి, ములుగురి నాగరాజు, తాళ్లూరి శ్రీనివాస్, గట్ల కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, కల్వకుంట్ల బిచ్చం, పార్టీ మండల నాయకులు, పట్టణ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.