విద్యార్థులు తాగునీరు. స్నానం చేసేందుకు నీరు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు.
సూర్య పేట్ జిల్లా ప్రతినిధి కోల రవీందర్ గౌడ్
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట గ్రామ పరిధిలో గల నెమలిపురి సోషల్ వెల్ఫేర్ ఎస్సీ గురుకుల పాఠశాల వసతి గృహ విద్యార్థులు తాగునీరు. స్నానం చేసేందుకు నీరు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. వర్షం కారణంగా కరెంటు లేకపోవడంతో కాలనీ సమీపంలోని కాలువ వద్దకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. ఇద్దరు విద్యార్థులు కలిసి ఒక బకెట్ నీళ్ళు, తిన్న ప్లేట్లు కడిగేందుకు కిలోమీటర్ దూరం మోసుకుంటూ వెళ్తున్నారు.