⏩::మెథడిస్ట్ చర్చిలో ప్రార్థనలు చేసిన ఫాస్టర్ రెవరెండ్ భాస్కర్
⏩::ప్రత్యేక ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు యువనస్తులు
తాండూరు రూరల్ మీ న్యూస్ ప్రతినిధి : తాండూరు మండలంలోని గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం తాండూర్ మండలం అంతారం గ్రామంలోని మెథడిస్ట్ చర్చిలో గుడ్ ఫ్రై డే ఘనంగా ప్రారంభించారు. గుడ్ ఫ్రై డే సందర్భంగా అంతారం మెత్తడిస్ట్ చర్చి సంఘ సభ్యులు ఫాస్టర్ రెవరెండ్ భాస్కర్ ఆధ్వర్యంలో చర్చి లో ప్రత్యేక ఆరాధన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా పాస్టర్ రెవరెండ్ భాస్కర్ మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే అంటే సరైన అర్ధం తెలియక చాలామంది అదేదో పండగలా భావిస్తారు. ఇందుకు కారణం ఆ పదంలో ‘గుడ్’ అంటే శుభ శుక్రవారం అని ఉండటమే. వాస్తవానికి గుడ్ ఫ్రైడ్ అంటే క్రైస్తవుల ప్రకారం మానవాళి చేసిన పాపాల కోసం తన ప్రాణాలను జీసస్ సిలువపై పణంగా పెట్టాడని చెబుతారు.. యేసు ప్రభువు చనిపోయిన రోజును గుడ్ ఫ్రైడేగా పిలుస్తారు. ఈ రోజున క్రైస్తవులు ఉపవాసం ఉండి దేవున్ని తలచుకుంటారు. ప్రత్యేక ప్రార్థనలో గడుపుతారు.క్రిస్మస్ వేడుకల కంటే చాలా ప్రాచీనమైనది గుడ్‌ఫ్రైడే! ప్రపంచ వ్యాప్తంగా గుడ్ ఫ్రైడే రోజున ఒకొక్కరూ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిపి ప్రార్థనను ముగించేందుకు సూచనగా 33 సార్లు చర్చి గంటను మోగిస్తారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెథడిస్ట్ సంఘ సభ్యులు క్రైస్తవ సోదరులు సోదరిమణులు చిన్నారులు ప్రత్యేక ఆరాధనలో పాల్గొన్నారు.