కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి..

Uncategorized నల్లగొండ నూతన కల్ రాజాకియం వ్యవసాయం సూర్యాపేట

కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి..

నిర్వాహకులు రైతులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలి.. 

ఎమ్మెల్యే మందుల సామేల్..

మీ న్యూస్ నూతనకల్ ప్రతినిధి: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ అన్నారు.బుధవారం మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు.రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ఆరబెట్టిన, నాణ్యమైన, తేమ శాతం కలిగిన ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని సూచించారు. సన్న రకం వడ్లకు ప్రభుత్వ మద్దతు ధరతో పాటుగా అదనంగా క్వింటాకు 500 రూపాయల చొప్పున బోనస్ ను ప్రభుత్వం అందజేయడం జరుగుతుందని తెలిపారు.కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు నిర్వాహకులు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగిన వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.అకాల వర్షం కారణంగా పశువులను కోల్పోయిన బాధితులకు చెక్కులు అందజేత గత కొద్ది రోజుల క్రితం కురిసిన అకాల భారీ వర్షాల కారణంగా  పశువులను కోల్పోయిన మండల పరిధిలోని మాచినపల్లి,భాగ్య తండా, యడవెల్లి గ్రామాలకు చెందిన 9 మంది బాధిత రైతులకు 4,83,500 రూపాయల చెక్కులను అందజేశారు. 

ప్రజా పాలనకు ఆకర్షితులై పార్టీలో చేరికలు కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజా పాలనకు ఆకర్షితులై మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగం సుధాకర్ రెడ్డి,తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి ల ఆధ్వర్యంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.పార్టీలో చేరిన జటంగి ప్రవీణ్,బొజ్జ వీరస్వామి,బొజ్జ నాగయ్య,బొజ్జ వెంకటేష్ లతోపాటు మరికొంతమంది కార్యకర్తలను ఎమ్మెల్యే పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనకల్ మండలంతో పాటు నియోజక వర్గంలోని అన్ని గ్రామాలను మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ నాగం జయసుధ సుధాకర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బంటు బద్రి,మండల కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు పసుల అశోక్ యాదవ్,నాయకులు కట్ట మల్లారెడ్డి, పన్నాల రమా మల్లారెడ్డి,దరిపెల్లి వీరన్న, గ్రామ శాఖ అధ్యక్షులు బొడ్డుపల్లి అంజయ్య,సురికంటి చంద్రారెడ్డి, భూరెడ్డి సంజీవరెడ్డి,పగిళ్ల అశోక్ రెడ్డి,లింగాల రామచంద్రయ్య, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

మీ న్యూస్ ప్రతినిధి అనంతుల చంద్రయ్య